Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతలో వీధి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలి
- కలెక్టర్‌కు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ఆదివారం నిర్వహించే సంతలో వీధి వ్యాపారస్తులపై మున్సిపల్ అధికారుల వేధింపులు ఆపాలని సంతలోపల వీధి వ్యాపారస్తులకు తమ వ్యాపారం చేసుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాలని కలెక్టర్‌కు సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియా సంతలో గత 30ఏండ్లుగా రోడ్డు పక్కన వీది వ్యాపారం చేసుకుంటున్నారని 1996 నుండి ఆదివారం సంతలో వ్యాపారం చేసుకోవడానికి మున్సిపల్ అధికారులకు సంత పన్ను చెల్లిస్తున్నారన్నారు. కరోనా సమయంలో సంత నడవక వారు వీధి వ్యాపారం చేసుకోలేదని తెలిపారు. తిరిగి సంత ప్రారంభమైన తర్వాత వ్యాపారం ప్రారంభించారని కానీ మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన షాపులు ఉండకూడదని హెచ్చరిస్తు, వారిపై ఒత్తిడి తీసుకువస్తూ వారి సామాన్లను గుంజుకుని షాపులు పెట్ట వద్దంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సంత లోపలి భాగం గ్రౌండ్లో కూరగాయలు హౌల్ సేల్ వ్యాపారుల కోసం షెడ్లు నిర్మించారని అది అందరి వ్యాపారస్తులకు సరిపోవట్లేదని, అందుకని వీధి వ్యాపారస్తుల కోసం కూడా షెడ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ వీధి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, వెంకటేశ్వర్లు, వేణు, మధు తదితరులు పాల్గొన్నారు.