Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం ములకపాడు యలమంచి సీతరామయ్య భవన్లో యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో మచ్చా, జిల్లా నాయకులు యలమంచి రవికుమార్‌లు పాల్గొని మాట్లాడారు. రెక్కాడితే గాని డొక్కాడని ఉపాది కూలీల డబ్బులు 4 నెలలు అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. అదేవిధంగా గిరిజనులు తరతరాలుగా సాగుచేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పోడుసాగుదారుల నుండి దరఖాస్తులు తీసుకొని ఇంతవరకు హక్కు పత్రాల జాడలేదన్నారు. పోడుసాగుదారులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెన్షన్, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న ఏ ఒక్కరికీ అందజేయలేదన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని వారు ఎద్దేవా చేశారు. ఇంటి స్థలం ఉన్న ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని, రైతుబంధు డబ్బులు వెంటనే జమ చేయాలని లేదంటే భవిష్యత్తులో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలన్నారు. లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు కె.చిలకమ్మా, మర్మం చంద్రయ్య, సరియం రాజమ్మ యలమంచి శ్రీను, మర్మం సమ్మక్క, కొడాలి లోకేష్ బాబు, ఖాదర్ బాబు, సరియం ప్రసాద్, సోయం వీర్రాజు, కూరం వీరభద్రం సోయం నాగమణి, ఎస్.కె.హుస్సన్ ఆహమ్మద్, కల్లూరు వీరభద్రం, గుడ్ల సాయి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.