Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-బూర్గంపాడు
గడ్డివాము దగ్ధమైన ఘటన బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెడ్డి పాలెం గొమ్మూరు కాలనీకి చెందిన రైతు బుస్కాని భద్రం పదెకరాల్లోని గడ్డి వాము వేశారు. ఆ గడ్డివాముకు సోమవారం మధ్యాహ్నం సమయంలో మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి అందజేశారు. అదేవిధంగా సంఘటన స్థలానికి తహశీల్దార్ భగవాన్ రెడ్డి, ఎస్ఐ దారం సురేష్‌లు చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఫైర్ ఇంజిన్‌తో పాటు బూర్గంపాడు, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీలకు చెందిన వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే గడ్డివాము పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.80 వేలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఈ సమయంలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు సకాలంలో చెల్లించాలి
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీకే ఓసి పరిధిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు కాంట్రాక్టర్లు సకాలంలో చెల్లించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు, కాంట్రాక్ట్ కార్మికులు పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మి గౌడ్‌కి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పీకే ఓసీ పరిధిలో భారీ యంత్రాల క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు మే నెల జీతాలు చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంగీ లాల్, కాంట్రాక్ట్ కార్మికులు మాలోత్ రవి, ఎం.ఉప్పలయ్య, రాజు సమ్మయ్య, అశోక్, హరికృష్ణ, నరేష్, సతీష్ వీరప్రసాద్, శ్రీను, హనుమంతరావు, ప్రసాద్, రాములు కాంతారావు, సారయ్య, అన్నమయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.