Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఈ వానాకాలంలో పత్తి సాగు అధిక విస్తీర్ణంలో సాగు చేయటం వలన లబ్ది పొందాలని కలెక్టర్ అనుదీప్ రైతులను కోరారు. మంగళవారం వానాకాలంలో పత్తి సాగు ప్రాధాన్యతను, అవసరాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను, కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ వానాకాలం-2022లో పత్తి, కంది పంటల విస్తీర్ణం పెంచుటకు ప్రతిపాదించడం జరిగింది. కరపత్రాల ద్వారా పంట సాగు విధానాల పై 67 రైతు వేదికలలో క్లస్టర్ల వారిగా శిక్షణ, అవగాహన కల్పించారు. పత్తి సాగు ప్రాధాన్యతను రైతులకు తెలియచేసేందుకు పోస్టర్లు, కరపత్రాలు, చిరుపుస్తకాల ద్వారా ప్రచారం జరుగుతుంది. గత వానాకాలం2021 కాలంలో ప్రత్తి 1లక్షా 60వేల 548 ఎకరాలు, కంది 11వేల 519 ఎకరాల విస్తీర్ణంలో సాగావ్వగా, ఈ వానాకాలం-2022 కాలానికి ప్రత్తి 1లక్షా75 వేల 619ల ఎకరాలు, కంది 15వేల122ల ఎకరాల విస్తీర్ణంలో పండించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవిన్యూ అధికారి అశోక చక్రవర్తి, వ్యవసాయ అధికారి కె.అభిమన్యుడు, జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న, వ్యవసాయ సహాయ సంచాలకులు రవి కుమార్, లాల్‌చంద్ పాల్గొన్నారు.