Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన వారికి డబుల్ బెడ్ రూములు అందజేయాలి
- కలెక్టరేట్ ముందు ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
పాల్వంచ గుడిపాడు గ్రామస్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, గుడి పేరుతో చేస్తున్న అక్రమ వసూళ్లు నిలిపి వేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వర మాట్లాడుతూ పాల్వంచ మున్సిపల్ పరిధిలోని గుడిపాడు గ్రామంలో సుమారు 120 ఆదివాసీ, గిరిజన కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా ఇళ్ళు. కట్టుకొని నివాసం వుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో పలువురికి ఇందిరమ్మ గహ వసతి స్కీం ద్వారా పక్కా ఇళ్లు మంజూరు అయిన వని తెలిపారు. మున్సిపాల్టీ ద్వారా మౌలిక సదుపాయలైన రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, ఇతర సౌకర్యం కల్పించినారు. విద్యుత్ శాఖవారు విద్యుత్ ఏర్పాటు చేసినారు. విద్యాశాఖ స్కూల్ ఏర్పాటు చేసినారు. వైద్య శాఖ అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసినారు. గత మూడు నెలల నుండి దేవాదాయ శాఖ వారు ఈ భూములు మోక్ష వెంకటేశ్వర స్వామి గుడికి చెందిన భూములని మీరు ఖాళీ చేయాలని లేని పక్షంలో మేమే కూల్చి వేస్తామని బెదిరిస్తున్నారు. నెలకు రూ.200లు కిరాయి కట్టమని బెదిరించి, మాతో కిరాయిలు కట్టిస్తున్నారని వాపోయారు. కోర్టులో కేసు వేసి మా ప్రమేయం లేకుండానే కోర్టు ఆర్డర్ ఉందని మమ్ములను బయపడుతున్నారన్నారు. ఇక్కడ నివాసం వుండే వారంతా ఆదివాసీ గిరిజనులు, ఒక్క కుటుంబం కూడా వేరేవాళ్ళు లేరనీ , గిరిజనులే ఉన్నారని కావున మీరు మా గ్రామాన్ని సందర్శించి మా నివాసలకు హక్కు పత్రాలిచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం. జ్యోతి, సీపీఐ(ఎం) పాల్వంచ పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్, జిల్లా నాయకులు లిక్కి బాలరాజు, భూక్యా రమేష్ , కె. సత్య సంఘీభావం తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన తప్పదని స్పష్టం చేశారు. ఆందోళనలో సంఘం నుండి ఎస్. పద్మ. రమాదేవి, గుడిపాడు మున్సిపల్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.