Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్‌ను అడ్డకున్న మత్స్యకారులు
- పెట్రోల్ పోసుకోవటంతో కారేపల్లిలో ఉద్రిక్తత
- సమగ్ర నివేదిక ఇవ్వండి: అడిషనల్ కలెక్టర్
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి పెద్దచెరువులో క్రీడా మైదానం ఏర్పాటుపై మత్స్యకారులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కుచించుక పోతుంది చెరువు శిఖంలో పల్లెపకృతి వనాలు, క్రీడా మైదానాలు వద్దని మత్స్యకారులు మొత్తుకున్న అధికారులు వారి అందోళనను పెడచెవిన పెట్టి పనులు చేస్తుండటంతో పనులను మత్స్యకారుల కుటుంబాలు అడ్డుకుంటున్నాయి. సోమవారం చెరువులో దీక్ష చేపట్టారు. ఈదీక్షలను అఖిల పక్షం మద్దతు ప్రకటించింది. ఈక్రమంలో క్రీడా మైదాన పనులను పరిశీలించటానికి అడిషనల్ కలెక్టర్ స్నేహలత వస్తున్నారని తెలియటంతో మత్స్యకారుల కుటుంబాలు పెద్దఎత్తున క్రీడా మైదాన ప్రాంతానికి చేరుకున్నారు. అడిషనల్ కలెక్టర్ క్రీడా మైదాన ప్రాంత వివరాలను ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్ధార్ కోట రవికుమార్, ఇరిగేషన్ డీఈ వెంకట్నాయక్లను అడిషనల్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. క్రీడా మైదాన ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఇరిగేషన్ డీఈ వెంకట్‌నాయక్ అడిషనల్ కలెక్టర్‌కు వివరించారు. శిఖంలో క్రీడా మైదానం ఏర్పాటు ఇరిగేషన్ నుండి ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. దీనిపై మండల అధికారులపై అడిషనల్ కలెక్టర్ అసహానం వ్యక్తం చేశారు.
కారుకు అడ్డుపడిన మత్స్యకారులు
క్రీడా మైదానం వద్దని నిరహర దీక్ష చేస్తున్న టెంట్ వద్దకు వచ్చిన అడినల్ కలెక్టర్ మత్స్యకారులను సముదాయించటానికి ప్రయత్నించారు. తమకు భుక్తి కల్పించే చెరువు కబ్జాదారులు అక్రమిస్తుండగా ప్రభుత్వం సైతం క్రీడా మైదానాల పేరుతో చెరువులను పూడ్చి వేయటం ఏమిటని మత్స్యకారులు ప్రశ్నించారు. క్రీడా ప్రాంగణ పనులు చేయిస్తున్న ఎంపీడీవో, తహసీల్ధార్లను పంతానికి పోయి మా పోట్టకొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రతిపాధిత క్రీడా మైదాన ప్రాంతం చెరువు ఎఫ్టీఎల్ అని నీటిపారుదల శాఖ అధికారులు తెల్పుతున్న మండల అధికారులు పట్టుదలకు పోతున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఒక దశలో మత్య్సకారుడు వెంకట నారాయణ పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యయత్నంకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తహసీల్ధార్ ఎంపీడీవోలన సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అడిషల్ కలెక్టర్ అక్కడి నుండి వెళ్ళటానికి ప్రయత్నించగా మత్స్యకారులు కారుకు అడ్డుపడి నిరసన తెలిపారు. తహసీల్ధార్, ఎంపీడీవోలతో మత్స్యకారులు వాగ్వివాదం దిగారు. పరిస్ధితి ఉద్రిక్త పరిస్ధితి నెలకొనటంతో సింగరేణి సీఐ అరీఫ్ అలీఖాన్ ఆధ్వర్యంలో కారేపల్లి, కామేపల్లి ఎస్సైలు కుశుమార్, కిరణ్‌కుమార్‌లు అందోళన కారులకు సర్ధిచెప్పి కారుకు అడ్డు తొలగించారు.
చెరువుకు హద్దులు నిర్ణయిస్తాం - అడిషనల్ కలెక్టర్
కారేపల్లి పెద్దచెరువు ఎఫ్టీఎల్ హద్దులు నిర్ణయిస్తామని అడిషనల్ కలెక్టర్ స్నేహలత తెలిపారు. క్రీడా మైదానం కూడా మంచి పని అని అలోచించాలని కోరారు. క్రీడా మైదాన వివాదంపై రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎఫ్టీఎల్ పరిధిలో కాకుండా క్రీడా మైదానంకు స్ధలం గుర్తించాలని ఆదేశించారు.