Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ సిబ్బంది వర్సెస్ సాగు దారులు
- వ్యవసాయ తరుణంలో పోడు పోరు
- హరిత వనంలో యుద్ద మేఘాలు
- పోడు హక్కుతోనే పరిష్కారం : సీపీఐ(ఎం)
- రక్షిత అటవీ ప్రాంతంలోనే హరిత హారం : అటవీ శాఖ
నవతెలంగాణ-అశ్వారావుపేట
వ్యవసాయ తరుణం సమీపిస్తుంది అంటే చాలు పత్ర హరితం కప్పుకుని పచ్చని హారంలా కనిపించే గిరిజన గూడేల్లో పోడు పోరుతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. తరతరాలు అడవిలోనే మా జీవనం, పోడు సాగే మా జీవనాధారం అంటూ గిరిజనులు ఒక పక్క బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్ళ దీస్తుంటే మరో పక్క రక్షిత అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడం మా విధి, అడవులతో నే పర్యావరణ మెరుగు పడుతుంది. అందుకోసం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే 2005 అనంతరం ఆక్రమించిన భూములను తిరిగి రక్షించుకుంటాం అంటున్న అటవీ పోలీసులు. జీవనా ధారం అయిన భూమి కోసం గిరిజనులు, ప్రభుత్వ అధి కారులుగా విధినిర్వహణ పాటిస్తూ ఇరు వర్గాలు మోహ రించేస్తారు. దీంతో ఈ పోడు సమస్య ఆరని ఆజ్యంలా రగులుతూనే ఉంది. దీనికి పరిష్కారం పోడు హక్కు కల్పించడం ఒక్కటే మార్గం అని వామపక్ష నాయకులు సూచిస్తున్నారు. కానీ రక్షిత అటవీ భూమిని వదిలేసే లేదని నిబంధనల ప్రకారమే భూమి స్వాధీనం చేసుకుం టున్నాం అని అటవీశాఖ పట్టుబడుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం విధాన పేరు అయినా నిర్ణయమే పరిష్కారం.
రెవిన్యూ, అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం
మండలంలోని 30 పంచాయ తీలకు గానూ 23 పంచాయతీల్లో అటవీ భూములు ఉన్నాయి. ఇందులో 2005 ఆర్ఓఎఫ్ఆర్ నిబంధనలు ప్రకారం ఇప్పటికే 947 మందికి 3614.25 ఎకరాలకు పట్టాలు ఇచ్చామని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు పోడు సాగు దారుల నుండి 20034.14 ఎకరాలకు గాను 5111 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తహశీల్దార్ చల్లా ప్రసాద్ తెలిపారు.
పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలి
సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కె.పుల్లయ్య
పోడు సాగు దారులు నుండి స్వీకరించిన దరఖాస్తులపై ప్రభుత్వం వెంటనే విధానం నిర్ణయం ప్రకటించాలి. ఈ ఏడాది సాగు సమయానికి సాగు చేసుకునే ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చి వ్యవసాయానికి ఆర్ధిక సహాయం అందించాలి. ధరఖాస్తులు స్వీకరించి నందున ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు అటవీ అధికారులు పోడు సాగు దారులను భయబ్రాంతులకు గురి చేయకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. సాగుదారుల పైన, వారికి మద్దతుగా నిలిచిన నాయకుల పైనా బనాయించిన కేసులను ప్రభుత్వం ఉపసం హరించు కోవాలి. అలా చేయకపోతే సాగు దారులను సమీకరించి మరిన్ని ఉద్యమాలకు రూపకల్పన చేస్తాం.
నిబంధనలు మేరకే రక్షిత అటవీ భూములు స్వాధీనం
ప్రభుత్వ నిబంధనల మేరకే ఆక్రమణకు గురైన రక్షిత అటవీ ప్రాం తాలను పునరుద్ద రిస్తున్నాము. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే అడవులు పెంపుదల శిరోధార్యం. అందుకోసమే లేదు రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది. నిజమైన సాగు దారులకు పూర్తి రక్షణ కల్పిస్తాం.
- అబ్దుల్ రహ్మాన్ ఎఫ్ఆర్ఓ అశ్వారావుపేట