Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్తి చావా రవి
నవతెలంగాణ-కొత్తగూడెం
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూలు తక్షణమే విడుదల చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్తి చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని టీఎస్ యుటిఎఫ్ భద్రద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం'' టీచర్స్ భవన్లో జిల్లా ఆద్యక్షులు బి.కిషోర్ సింగ్ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నముల షెడ్యులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో చేపడతామన్న హామీని ప్రభుత్వం నెరవేర్పటంలో విఫలమైందని, వెంటనే బదిలీల, పదోన్నతుల షెడ్యుల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులందరూ బదిలీలు, పదోన్నతుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని, వేసవి సెలవులు పూర్తి అయిన తరువాత కూడా షెడ్యూల్ విడుదల కాకపోవడం చేత తీవ్రమైన అందోళనలో ఉన్నారని, ఈ సంవత్సరం కూడా పదోన్నతులు, బదిలీలు జరుగదేమోననే నిసృహాలో ఉన్నారన్నారు. ఉపాద్యాయుల అనుమానాలకు తెరదించుతూ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. నాన్ గెజిటెడ్ టీచర్ పోస్టులను ఇంటిగ్రేటెడ్ జిల్లా క్యాడర్‌గా ప్రకటించటంపై హైకోర్టులో ఉన్న వాజ్యం దృష్ట్యా తాత్కాలికంగా స్కూల్ అసిస్టెంట్, ప్రైమెరీ స్యూల్ హెడ్మాస్టర్, హై స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యాశాఖ పరిధిలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు వేర్వేరుగా పదోన్నతులు ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమావేనలలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యన్.కృష్ణ, జిల్లా కార్యదర్శులు డి.దాసు, బి.బిక్కు, జిల్లా కోశాధికారి యస్.వెంకటేశ్వర్లు (ఎస్.వి) మండల భాద్యులు యం. రాందాస్, యస్. వెంకటమ్మ, బి.బాబూలాల్, ఆర్.సురేష్ బాబు, యం.జానకీదేవి పాల్గొన్నారు.