Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలపై మిలిటెంట్ పోరాటాలు నిర్వహించాలి
- యువత రాజకీయాల్లోకి రావాలి
- సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
సీపీఎం శ్రేణులు గ్రామాలే ఉద్యమ కేంద్రాలుగా పోరాటాలు నిర్వహించాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలోని బీటిఆర్ భవన్లో జరుగుతున్న పాలేరు, మధిర నియోజకవర్గాల సిపిఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో చివరి రోజైన మూడవరోజు మొదటి క్లాస్ ''పార్టీ- ప్రజాసంఘాల నిర్మాణం అనే అంశంను తమ్మినేని బోధించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పార్టీ శ్రేణులకు వివరించారు. ప్రజా సంఘాల పనితీరు ప్రజలతో సత్సంబంధాలు ఎలా కలిగి ఉండాలో శ్రేణులకు వివరించారు. చేప నీటిలో ఉంటేనే ఎలా బతుకుతుందో కమ్యూనిస్టులు కూడా ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటేనే మనగలుగుతారని తెలిపారు. కమ్యూనిస్టులు ప్రజల్లో లేకపోతే నీటిలోనుంచి ఒడ్డుకు చేరిన చేప పరిస్థితి మాదిరే అవుతుందన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై ప్రజా సంఘాలు నిత్యం పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు ఎప్పుడూ ఆందోళనలే కాకుండా పోరాటాలు చేసేందుకు ప్రజలను సిద్ధం చేయాలని సూచించారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. దేశంలో నేడు కుల, మత, ప్రాంతల పేరుతో రాజకీయాలు చేస్తూ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత రాజకీయాల్లో చేరి కుల, మత అంతరాలు లేని సమ సమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. రెండవ క్లాస్ ''పార్టీ కర్తవ్యాలు'' సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ బోధిం చారు. పార్టీ కార్యకర్తలు నిరంతరం అధ్యయనం చేయాలని సూచించారు. సిపిఎం శ్రేణులు తమను తాము మెరుగు పరుచుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ప్రతి చదువరి నాయకుడు కాకపోయినా పర్వాలేదు కానీ, ప్రతి కమ్యూనిస్ట్ తప్పనిసరిగా చదువరి కావాలన్నారు. త్వరలో గ్రామ స్థాయిలో కూడా రాజకీయ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సంఘాలు గ్రామాల్లో నిత్యం వర్గ పోరాటాలు నిర్వహించాలని సూచించారు. పాలేరు, మధిర నియోజకవర్గల్లో ప్రజాసంఘాలు వర్గ పోరాటాలపై దృష్టి సారించాలన్నారు. ఈ క్లాస్‌లకు ప్రిన్సిపాల్‌గా బండి పద్మ వ్యహరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బుగ్గవీటి సరళ, జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్, గుడవర్తి నాగేశ్వరరావు, కొమ్ము శ్రీను, మడుపల్లి గోపాల్‌రావు, దొండపాటి నాగేశ్వరరావు, ఉరడీ సుదర్శన్‌రెడ్డి, భట్టు పురుషోత్తం,షేక్ బషీరుద్దీన్, మండవ ఫణిద్ర కుమారి, పెండ్యాల సుమతి, సీనియర్ నాయకులు వత్సవాయి జానకి రాములు, సిద్దినేని కోటయ్య, బోనకల్ మాజీ ఎంపీపీ తుళ్లూరి రమేష్, సీపీఎం నాయకులు నందిగామకృష్ణ, తోటకూరి రాజు, పొన్నెకంటి సంగయ్య, తోట పెద్ద వెంకట రెడ్డి తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికి మంచినీరు అందించడం గొప్ప విషయం
వైరాటౌన్ :గ్రామంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ మంచినీరు అందించాలనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వైరా మండలం పాలడుగు గ్రామంలో సిపిఐ (ఎం) సీనియర్ నాయకులు వనమా చిన్న సత్యనారాయణ 5లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను సోమవారం సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వనమా చిన్న సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పార్టీ నిరంతరం ప్రజా సమస్యల పైన పోరాటాలు చేయడంతో పాటు పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నీటి కాలుష్యం వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, 80శాతం అంటురోగాలు నీటి కాలుష్యం వలన వస్తున్నాయని అన్నారు. ప్రతి వ్యక్తికి పరిశుభ్రమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో వాటర్ ప్లాంట్ నిర్మించడం అభినందనీయమని అన్నారు. సొంత ఖర్చులతో మంచినీటి పథకాన్ని నిర్మించిన వనమా చిన్న సత్యనారాయణ, వారి కుమారులు శ్రీనివాసరావు, రమేష్ బాబు, వారి కుటుంబ సభ్యులను తమ్మినేని వీరభద్రం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భుక్య వీరభద్రం, బొంతు రాంబాబు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు మల్లెంపాటి వీరభద్రం, ఎంఈఓ కొత్తపల్లి వేంకటేశ్వరరావు, వైరా రూరల్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు బాజోజు రమణ, తూము సుధాకర్, షెక్ మజీద్, శహానాబీ, మాజీ సర్పంచులు పొట్టపల్లి శ్రీనివాసరావు, ఇరపాసి భాస్కరరావు, వనమా జానకిరామయ్య, తాల్లూరి నాగేశ్వరరావు, గుడిమెట్ల మెహనరావు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
వేల్పుల కిరణ్‌ను ఆశీర్వదించిన తమ్మినేని
వైరా మండలం వల్లాపురం గ్రామంలో వివాహం చేసుకుంటున్న నూతన వరుడు వేల్పుల కిరణ్‌ను సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఆశీర్వదించారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భుక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, వైరా రూరల్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మండల కార్యదర్శివర్గ సభ్యులు బాజోజు రమణ తదితరులు పాల్గొన్నారు.