Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి పేద మధ్యతరగతి వారికి ఇంగ్లీష్ విద్య కలలను సాకారం చేయడానికి ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం ఇది వృత్తంగా నిర్మించిన లఘుచిత్రం ''మన ఊరు మన బడి మంగళవారం తోపుడు బండి ఫౌండేషన్ ఆఫీసులో తోపుడు బండి ఫౌండర్ సాదిక్ అలి చేతుల మీదుగా యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. కల్లూరు మండలం చెన్నూరు ప్రభుత్వ ఉపాధ్యాయులు దంతాల సుధాకర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం గురించి ప్రజలకు అవగాహన అవగాహన పెంచడానికి ఈ లఘు చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ లఘుచిత్రంలో ముత్యాల ఆనంద్ బాబు, ముత్యాల నిహారిక, మాస్టర్ జూహిత్ శ్రీ హర్ష, బీరవెల్లి శ్రీనివాసరావు, కొడిశాన విజరు కుమార్, తదితరులు నటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దంతాల సుధాకర్, బీరవెల్లి శ్రీనివాసరావు, కొడిశాన విజరు కుమార్, వరక రామారావు, అమర్నాథ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.