Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బూర్గంపాడు మండలం మోతె పట్టినగర్ గ్రామంలో మంగళవారం జరిగింది. ఎదుళ్ల వాగు వంతెనకు ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడాన్ని గుర్తించిన స్థానికులు బూర్గంపాడు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడిని భద్రాచలం పట్టణానికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు, దర్యాప్తులో వివరాలు తెలుస్తాయని బూర్గంపాడు ఎస్సై దారం. సురేష్ తెలిపారు.