Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఆగ్రహం
- మిషన్ భగీరథ నీళ్లు ప్రతి గ్రామానికి అందించాలి
నవతెలంగాణ-కామేపల్లి
ఇరిగేషన్, ఐటీడీఏ, అధికారులు పనితీరును మార్చుకోవాలని ఎంపీపీ బానోతు సునీత, సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి సునీత అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత వ్యవసాయ శాఖతో ప్రారంభమైన సమావేశం వివిధ శాఖల అధికారులు నివేదికలతో సమావేశం మొదలైంది. ఇరిగేషన్, ఐటిడిఎ అధికారులు పనితీరు మార్చుకోవాలని, మిషన్ భగీరథ నీళ్లు ప్రతి గ్రామానికి అందేలా ఏఈ చిరంజీవి, సిబ్బంది పని చేయాలని తెలిపారు. వివిద శాఖలపై సమీక్ష సమావేశం జరిగింది. సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు ఎంపిపి తెలిపారు. అధికారులు సర్వసభ్య సమావేశానికి హాజరు అయ్యే ముందు నివేదికలతో హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహసిల్దార్ జి కృష్ణ, ఎంపీవో సత్యనారాయణ పాల్గొన్నారు.