Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థను విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయముకు వచ్చిన పాఠకులను వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠకులకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలు గ్రంధాలయం నందు అందుబాటులో ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు పులిగండ్ల మాధవ్, టిఆర్ఎస్వి. రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్.రాజు, పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పొడియం నరేందర్, షేక్.అన్వర్, మిట్ట కంటి సురేందర్ రెడ్డి, సిరివేరు వెంకటేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.