Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
సమీకృత జిల్లా అధికారుల సముదాయంలో ఫర్నీచర్ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ కాంట్రాక్టరును ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా అధికారుల సముదాయం, వైద్య, భోదనా ఆసుపత్రులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముదాయపు బోర్డు చక్కగా కనిపించే విధంగా త్రీడి విద్యుద్దీకరణ చేయాలని చెప్పారు. కార్యాలయం ముందర లాన్లో గ్రీనరీ కొరకు మొక్కలు నాటాలన్నారు. మిషన్ బగీరథ, విద్యుత్ ఏర్పాట్లు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశపు హాలులో టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటుతో పాటు ఆడియో ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సముదాయంలో ఏర్పాటు చేయుచున్న ఫర్నీచర్ వివరాలను ర.భ. అధికారులు దృవీకరణ చేసి నివేదిక ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. కార్యాలయాలకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమీకృత జిల్లా అధికారుల సముదాయంలో నిర్మిస్తున్న జిల్లా అధికారుల నివాస గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. వైద్య కళాశాల నిర్మాణ పనులను తనిఖీ చేసిన ఆయన ముందర ఆర్చ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ పనులు సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు. గతంలో జాతీయ మెడికల్ కౌన్సిల్ తనిఖీకి వచ్చిన సందర్భంలో సూచించిన అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని చెప్పారు. భోదనా ఆసుపత్రిలో తక్షణం ఓపి సేవలు ప్రారంబించాలని చెప్పారు. జరుగుతున్న పనులను డీఎం ఈ ప్రిన్సిపాల్ పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, ఆర్అండ్బి ఈఈ భీమ్లా, ఉద్యాన అధికారి మరియన్న, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, డియంఈ ప్రిన్సిపాల్ లక్ష్మణావు, పర్యవేక్షకులు డాక్టర్ కుమారస్వామి, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.