Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటాలు
- పీవోడబ్ల్యూ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల్లో వి.సంధ్య
నవతెలంగాణ-ఇల్లందు
4 కోట్ల ప్రజల ఆకాంక్షలలో సగభాగమైన మహిళల ఆకాంక్షలు పట్టించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని పీవోడబ్ల్యూ, జాతీయ కన్వీనర్ వి.సంధ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభద్ర, టీపీటీఎఫ్ కార్యదర్శి ఎస్.కవిత అన్నారు. రెండు రోజుల ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు చింతా లక్ష్మీ నగర్, బాలాజీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ సుభాష్ నగర్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాలనుండి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్న శిక్షణా తరగతుల్లో మాట్లాడారు. సంఘం 1970 దశకంలో ఏర్పడిందన్నారు. నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు నిర్వహించిందని, స్త్రీ విముక్తి లక్ష్యంగా, స్త్రీలపై జరిగే అన్ని రకాల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా స్త్రీ-పురుష సమానత్వం కోసం పోరాడుతోందన్నారు. రాష్ట్రం ఎన్నో పోరాటాలు, త్యాగాలఫలితంగా సాధించుకోగా, నేడు నీళ్లు, నిధులు, నియామకాల వాగ్దానాలు నీటిమీది మాటలుగానే మిగిలిపోయాయి. తెలంగాణలో మహిళలపై, బాలికలపై అత్యాచారాలు, దాడులు నిత్యకృత్యమయ్యాయి. అనంతరం పితృస్వామ్యం-మహిళల ప్రతిఘటన అనే మహిళా చేతన సంస్థ వ్యవస్థాపకులు అంశంపై కె.పద్మ, కాశ్మీర్-భారత రాజకీయాల ఆకళింపు అనే అంశంపై బి.రమాసుందరి, ప్రగతిశీల మహిళా సంఘం ఏపీ ఉపాధ్యక్షులు మాట్లాడారు.