Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రేమ జంట లేచిపోయింది. ఈ వ్యవహారం ఆ జంటకు సహాకరించారు అనే కారణంగా వారికి సన్నిహితులైన ఇరువురిని సర్పంచ్, మరి కొందరు పెద్దలు సమక్షంలో ప్రశ్నించే సమయంలో ఒక యువకుడు పై సర్పంచ్ భౌతిక దాడి చేసాడనే నెపంతో అతను అవమానానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో సర్పంచ్‌పై చర్య తీసుకోవాలని బందువులు మృత దేహంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ సంఘటన పై మృతుడు తల్లి తుమ్మా కుమారి ఫిర్యాదు ప్రకారం ఎస్.ఐ చల్లా అరుణ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, టి.నర్సాపురం మండలం, గండిగూడెం వాస్తవ్యురాలు తుమ్మా కుమారి కుమారుడు భవానీ శంకర్ (19) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల ఆ గ్రామంలో ఓ ప్రేమ జంట లేచి పోయారు. ఈ ప్రేమ జంట వ్యవహారంలో భవాని శంకర్ సహాయం ఉందని భావించిన స్థానిక సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం మరి కొందరు పెద్దలు ఈ నెల 12 ఆదివారం అదే గ్రామానికి చెందిన వేముల సాయి ఫోన్ నెంబర్ 6303132737 నుండి భవాని శంకర్ ఫోన్ నెంబర్ 7674859219కు ఫోన్ చేసి పంచాయతీ కార్యాలయానికి రమ్మన్నారు. ఈ సందర్భంగా లేచిపోయిన జంట ఆచూకి తెలపాలని చిత్రహింసలకు గురి చేసారు. ఇది తట్టుకోలేక భవాని శంకర్ పురుగులు ముందు సేవించి అదే రోజు ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం స్థానిక వైద్యులు కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ విషమించడంతో అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం రిఫర్ చేసారు. ఖమ్మం వెళ్తుండగా మంగళ వారం మార్గం మధ్యలో మృతి చెందాడు. ఇతని మృతికి సర్పంచ్ వెంకట ముత్యం కారణ మనే మృతుని తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని ఎస్.ఐ అరుణ తెలిపారు.