Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ
నవతెలంగాణ-మణుగూరు
పెట్రోల్ పేరుతో కార్మికులను సింగరేణి యాజమాన్యం దోపిడీ చేస్తుందని బ్రాంచ్ కార్యదర్శి వెంకటరత్నం అన్నారు. మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ప్రతి నెలా 20 లీటర్లు సింగరేణి బంకు ద్వారా కార్మికులకు పెట్రోల్ విక్రయిస్తున్నారన్నారు. బహిరంగ మార్కెట్లో పెట్రోల్ రూ.110 ధర ఉంటే, సింగరేణి యాజమాన్యం రూ.132కు విక్రయిస్తూ కార్మికులను నిలువుదోపిడీ చేస్తుందన్నారు. ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందో యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఈశ్వరరావు, ప్రభాకర్ రావు, రామ్మూర్తి, విల్సన్, బుచ్చిరెడ్డి, శివకుమార్, బిక్షపతి, శ్రీనివాస,్ ముజఫర్, రాజు, వినోద్, తదితరులు పాల్గొన్నారు.