Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం ఐటిడిఎ పిఓ గౌతమ్ పొట్రు
నవ తెలంగాణ-బూర్గంపాడు
ప్రతి ఉపాధ్యాయుడు ఆంగ్లభాషపై పట్టు సాధించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండలంలోని జి.పి.ఎస్. గొమ్మురు పాఠశాలను ఆకస్మికంగా ఆయన సందర్శించారు. పాఠశాల బోర్డ్ ను ఇంగ్లీష్ మీడియం లో మార్చాలని ఆయన అన్నారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ పిఓ అందజేశారు. అదే విధంగా ఐటీడీఏ వారు ఇచ్చిన ప్లే మెటీరియల్స్ పరిశీలించి, విద్యార్థులతో సరదాగా చెస్ గేమ్ ఆడారు. అలాగే ఉపాధ్యాయులు కూడ చెస్ గేమ్ నేర్చు కోవాలని పిఓ ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని ఏ.యు. పి.యస్ .బూర్గంపాడు ను సందర్శించి 3-7 వ తరగతి వరకు పాఠశాలను కొనసాగి స్తూ, 3 నుంచి 10వ తరగతి వరకు హాస్టల్ వసతి సదుపాయం కల్పించాలని వార్డెన్ ను పిఓ ను ఆదేశించారు. అదేవిధంగా ఏ.జి.హెచ్. ఎస్. బూర్గంపాడు పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు,ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్న తీరును పరిశీలించారు. ప్రతి ఉపాధ్యాయుల ఆంగ్ల భాష మీద పట్టు సాధించాలని,తగు సల హాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసం చాలకులు రమాదేవి, భద్రాచలం ఏ.టి.డి.ఓ. నర్సింహారావు, భద్రాచలం, బూర్గంపాడ్ మండలాల ఎస్.సి.ఆర్.పి. రమేష్, ఏఈళ రాములు తదితరులు పాల్గొన్నారు.