Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ- చింతకాని
దళిత బందు లబ్ధిదారులు రూ.10 లక్షలతో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో దళిత బందు లబ్ధిదారులకు పరిశ్రమల స్థాపన పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయగలిగితే వారు జీవితంలో ఎవరిపై ఆధార పడాల్సిన అవసరం ఉండబోదని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా దళిత బందు ద్వారా ప్రతి కుటుంబానికి 10 లక్షల పెట్టుబడి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగ పరచుకోవాలి అన్నారు కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ అజరు కుమార్,ఎంపీపీ పూర్ణయ్య ,తహసిల్దార్ మంగీలాల్ ఎంపీడీవో శ్రీనివాస్ మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్ర ప్రసాద్ స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.