Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అశ్వారావుపేట
మండలంలోని గుమ్మడవల్లి పరిధిలో గల పెద్ద వాగు ప్రాజెక్టును జీఆర్ఎంబీ (గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు) బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు గేట్లు, కాలువలను పరిశీలించింది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతం, సాగులో ఉన్న ఆయకట్టు వివరాలపై బృందం అధికారులు ఆరా తీశారు. విస్తీర్ణం, మరమ్మతులకు అవసరమైన అంచనాలను సేకరించారు.ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో ఎన్ని ఎకరాలు సాగు అవుతుంది, కాలువలు, తూములు ఎన్ని ఉన్నాయో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బృందంలో జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ ఆగస్త్యన్, ఎస్ఈ ప్రసాద్, డీఈఈ సురేష్, ఇరిగేషన్ ఈఈ సురేష్, డీఈ ఎల్. కృష్ణ,ఎ.ఇ కె.ఎన్.బి క్రిష్ణ లు ఉన్నారు.