Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొగా శ్రమదానంలో పాల్గొన్న కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రతి ఇంటి నుండి సేకరించిన వ్యర్థాలను వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆరు బైట వ్యర్థాలు వేస్తే వారిపై జరిమానాలు విధించాలని కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులోని వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని, మురుగు కాల్వలను, పార్కులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రామవరంలోని 6వ వార్డులో మున్సిప్ చైర్పర్సన్ కాపుసీతా లక్ష్మీ, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి మెగా శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూరు శాతం ప్రతి ఇంటి నుండి వ్యర్థాల సేకరణ జరగాలని, ఆరుబయట వ్యర్ధాలు వేసే యజమానులకు జరిమానాలు విధించాలని చెప్పారు. ప్లాస్టిక్ బాటిళ్లు ప్యాకింగ్, బెలియింగ్ మిషన్ ద్వారా కొబ్బరి బోండాలను ముక్కలు చేయు విధానాన్ని పరిశీలించారు. రోజు వారి కేంద్రానికి వస్తున్న వ్యర్ధాలను రిజిష్టరులో నమోదు చేసిన అంశాలను పరిశీలించారు. పట్టణంలో ప్రతి నెలా దాదాపు 70 టన్నుల వ్యర్థాలు ఉత్పన్నం అవుతున్నాయని, కానీ 50 శాతం మాత్రమే వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తెస్తున్నారని సేకరణలో ఎందుకు గ్యాప్ వస్తున్నదని ఏఈలను అడిగి తెలుసుకున్నారు. రామవరంలోని రామచంద్ర డిగ్రీ కాలేజి గ్రౌండ్లో నిర్వహించిన శ్రమదానంలో పాల్గొన్నారు. గడ్డి తొలగించారు. గ్రౌండ్లో మొక్కలు నాటారు. వ్యాపార సముదాయాలలో వెలువడే వ్యర్థాలు కూడా ఈ కేంద్రానికే తేవాలని చెప్పారు. వ్యర్థాల నిర్వహణ కేంద్రం ముందున్న ఖాళీ స్థలంలో చక్కటి మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తయారు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి అర్జున్, కమీషనర నవీన్, ఏఈలు రాము, సాహితి, తహసిల్దార్ రామకృష్ణ, వార్డు కౌన్సిలర్ పాల్గొన్నారు.