Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు వర్గాలు ఘర్షణ
- అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ ఖమ్మం
ఖమ్మంలో భూ కబ్జా ఫై ఒక వర్గం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చినప్పుడు మరో వర్గం అడ్డుకునేందుకు రావడం తో ప్రెస్ క్లబ్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసుల రంగ ప్రవేశం చేసి ఇరువురినీ అక్కడ నుండి పంపిన సంఘటన ఖమ్మం ప్రెస్ క్లబ్ లో చోటు చేసుకుంది. ఖమ్మం నగరం లోని వెలుగుమట్ల రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 205 లో 13.32ఎకరాల భూమి నీ పుట్టకోటకు చెందిన కొంత మంది రైతులు 60 సంవత్సరాల కిందట మాదిరాజు వెంకటేశ్వరావు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. రికార్డుల పరంగ వివాదాస్పదం గా ఉన్నా భూమి నీ హైదరాబాద్ కు చెందిన యాకుబ్ పాషా కొనుగోలు చేసాడు. బుధవారం కొనుగోలు చేసిన భూమిని చదును చేస్తుండగా కొంత మంది రైతులు సాగులో ఉన్నా రైతులు అడ్డుకున్నారు. ఎకరం కోటిన్నర విలువ చేసే భూమి నీ రూ.30 లక్షలకు కొనుగోలు చేయడం ఏమిటని మీరు ఆక్రమించడం ఏంటని రైతులు పనులను అడ్డుకున్నారు. ఇరువర్గాలు తోపులాటకు దిగిన అనంతరం ఘర్షణ సద్దుమణిగింది. దీంతో గురువారం ప్రెస్ క్లబ్ లో ఇరువర్గాలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. యాకుబ్ పాషా ను ప్రెస్ మీట్ పెట్టనివ్వకుండా ఓ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు, రైతులు అక్కడికి చేరుకొని మా భూమిని ఎలా కొనుగోలు చేస్తావ్ అంటూ నిలదీశారు. పాషాకు మద్దతుగా వచ్చిన మహిళా న్యాయవాది నీ సైతం మహిళలు చుట్టి ముట్టారు. దీంతో టూ టౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం యాకుబ్ పాషా బయటకు వస్తే కొడతారని భయం తో ప్రెస్ క్లబ్ లోనే 2 గంటల పాటు ఉన్నాడు. సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో యాకుబ్ పాషాను స్టేషన్కు తరలించారు. ప్రెస్ క్లబ్ లో మహిళా న్యాయవాది పై జరిగిన దాడిపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా న్యాయవాది ఫిర్యాదు చేశారు.