Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూలూరుపాడు : ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపోవడంతో నాలుగు మూగజీవులు మృతి చెందిన సంఘటన మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గాలి దుమారాన్నికి కొమ్ముగూడెం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో విద్యుత్ తీగలు పడి ఉండటంతో ధరావతు దేవా, భూక్య బాలు, బానోతు లక్మ, ధరం సౌత్ సునీతలకు చెందిన పశువులు మేతకు వెళ్లే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి రెండు ఎద్దులు, రెండు దూడలు మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.మూడు లక్షలు ఉంటాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి విద్యుత్ శాఖ ఏఈ ఆకుల రఘురామయ్య సందర్శించి జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం వచ్చే విధంగా చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.