Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం మార్కెట్ కు రెండవ స్థానం దక్కినందుకు మార్కెట్ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, సెక్రటరీ మల్లేశంలకు మంత్రి అభినందనలు
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
మార్కెట్కు పంట ఉత్పత్తులు తీసుకోవచ్చే రైతులకు సేవలు అందించడంలో ఖమ్మం మార్కెట్ అరుదైన రికార్డు సొంతం చేసుకోవడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాదులో జరిగిన అవార్డులు ప్రధానోత్సవం లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రెండవ స్థానం పొందిన సందర్భంగా గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, సెక్రెటరీ మల్లేశం, వైస్ చైర్మన్ వేంకటేశ్వర్లు, డీ.ఎం.వో నాగరాజు, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మార్కెట్ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న సెక్రెటరీ మల్లేశం. లను పూల బొకే ఇచ్చి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ అగ్రి మార్కెట్ విధానం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-టామ్ ఆన్ లైన్ విధానం అమలు పరచడంలో లో సత్తా చాటిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను మొదటి స్థానంలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ పాలకవర్గ సభ్యులు దేవత అనిల్, జంగం శ్రీనివాస్, అఫ్జల్, భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.