Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామచంద్రాపురం పేరెంట్స్ సంకల్పం
నవతెలంగాణ - అశ్వాపురం
1 నుండి 7 తరగతుల వరకు పూర్తి స్థాయి ఇంగ్లీషు మీడియం పాఠశాలగా మారిన మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల, రామచంద్రపురంను గ్రామస్తుల సహకారంతో అందంగా తీర్చి దిద్దు కుంటామని పాఠశాలలో తల్లి దండ్రులు నిర్ణయించుకున్నారు. పాఠశాలల తల్లిదండ్రుల సమావేశం గురువారం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బి. సంపత్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ప్రధానోపాధ్యాయులు ఎం. సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడతూ పాఠశాల స్థితిగతులు, తరగతి గదుల కొరత, రంగులు వేయించుట, ఆంగ్ల మాధ్యమం నిర్వహణ ఏర్పాటు మొదలగునవి వివరించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చర్చలలో పాల్గొని పలు సూచనలు చేసారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో విరాలాలు సేకరించి పాఠశాల మరమ్మత్తులు, రంగులు వేయించుట కొరకు కృషి చేయాలని తీర్మానించారు. కొంతమంది తల్లి తండ్రులు , పాఠశాల ఉపాధ్యాయులు కూడా తమ వంతు ఆర్ధిక తోడ్పాటు చేయుటకు ముందుకు వచ్చారు.వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు ఎం సత్యనారాయణను పలువురు అభినందించారు. గ్రామ పంచాయితీ సర్పంచ్ డా. అశోక్ మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైన సహకారం శక్తిమేరకు అందిస్తున్నామని ఇకముందు కూడా సహకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల కె. పద్మ, పాఠశాల ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయలు శ్రీనివాసరావు, కళ్యాణ్ చక్రవర్తి, జి.శ్వేత, అనురాధ తదితరులు పాల్గొన్నారు.