Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా, వ్యవసాయంతోనే గ్రామీణ వికాసం
- డిగ్రీ చేసిన యువతులకు నర్సింగ్ శిక్షణ
- మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆదివాసీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మాజీ మంత్రి, జలగం వెంగళరావు ట్రస్ట్ నిర్వాహకులు జలగం ప్రసాద్ రావు అన్నారు.
ట్రస్ట్ ఆద్వర్యంలో భాగస్వామ్యంలో వామపక్ష ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని గుంటిమడుగులో జేవీఆర్ ట్రస్ట్, విద్యుత్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన వ్యవసాయ పంపు సెట్లు ప్రారంభం కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యా, వ్వవసాయాభివృద్ధితోనే గిరిజన గ్రామాలు వికాసం చెందుతాయని అన్నారు. డిగ్రీ చదివిన గిరిజన యువతీలకు నర్సింగ్‌లో శిక్షణ ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. 40 ఏళ్ళ క్రితం మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందని కానీ స్థానిక గిరిజనులే ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని గుర్తు చేసారు.
గిరిజనులు చైతన్యం అయి ప్రస్తుతం ప్రభుత్వ సేవలు పొందాలనుకున్నా నేటి పాలకులు ఆ దిశగా ఆలోచించడం లేదని వాపోయారు. అటవీ ప్రాంతంలో గిరిజన రైతు పొలంలోకి వెళ్ళాలంటే పోలీసు అనుమతి తీసుకోవాల్సి వస్తుందని ఈ విధానం ప్రజాస్వామ్యానికి చేటు అని విచారం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలతోనే ప్రభుత్వ వ్యతిరేకులు తయారవుతారు అని వారినే మావోయిస్టుగా ముద్ర వేస్తాయి అంతే గానీ మావోయిస్టులు ఎవరో కాదని వ్యంగ్యంగా అన్నారు. పాలనా యంత్రాంగాలు సమన్వయంతో నే అభివృద్ధి సాధ్యం అని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి, జెడ్పీటీసి వరలక్ష్మి, రైతు బంధు మండల సమన్వయ కర్త జూపల్లి రమేష్, విద్యుత్ శాఖ ఎస్సీ రమేష్, డీఈ విజరు, ఏడీఈ వెంకటేశ్వర్లు, ఏఈ రవితేజ, స్థానిక సర్పంచ్ కంగాల గోవిందు, ప్రసాద్ శ్రీ వేణులు పాల్గొన్నారు.
జలగం ప్రసాద్ రావు కాళ్ళకు మొక్కిన ఎంపీఈఓ
జేవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గుంట ిమడుగులో గిరిజన లబ్ధిదారుల వ్యవసా య పంపు సెట్లు ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీఈఓ సీతారామరాజు మాట్లాడుతూ జలగం ప్రసాద్ రావు కాళ్ళకు మొక్కడం ఆసక్తిగా మారింది. ఇది కాస్తా స్థానికంగా చర్చాంశనీయం అవుతుంది.