Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ బస్సు, బొగ్గు లారీ ఢ
- ఇరువురు డ్రైవర్లు మృతి
నవతెలంగాణ-మణుగూరు
మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామానుజవరం ఆర్టీసీ బస్సు, బొగ్గు లారీ ఎదురెదురుగా ఢ కొనడంతో డ్రైవర్లు మృతి చెందారు. ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే గురువారం గుండాల నుండి ఎబి29జడ్0359 ఆర్టీసీ బస్సు మణుగూరుకు వస్తుండగా రామానుజవరం వద్ద మణుగూరు పికేఓసి 2 నుండి భద్రాద్రి పవర్ ప్లాంటుకు బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ ఢ కొన్నది. బస్సు తీవ్రంగా ధ్వంసం అయింది. బొగ్గు లారీ బోల్తాపడింది. లారీ డ్రైవర్ కన్నన్, బస్సు డ్రైవర్ బి.రాంబాబు (50) మరణించాడు. కండక్టర్ పవన్‌కుమార్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 20 మంది ప్రయాణీకులు ఉండగా 7 గురికి గాయాలయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుంటా వెంకటమ్మ మణుగూరు, రమేష్‌కు టీచర్ తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మృతుల కుటుంబాలను ఓదార్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. గాయాలైనా వారిని మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.