Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించాలని.... దిగుబడులు పెంచాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కోరారు. జిల్లా వ్యవసాయ అదికారి అభిమన్యుడు ఆద్వర్యంలో గురువారం వ్యవసాయ శాఖలో డిప్లొమా ఇన్ ఆగ్రికల్చర్ ఎక్స్ టెన్సన్ సర్విసెస్ ఫర్ ఇన్ఫ్రూట్ డీలర్స్(డిఏఇఎస్ఐ) కోర్సు 3వ బ్యాచ్-2021-22. పూర్తి చేసుకున్న వారికి కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికేట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కోర్సులో 40 వారాలు తరగతి, 8 వారాలు ప్రాక్టికల్ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న రైతులకు విస్తరణ సేవలు పూర్తి స్థాయిలో అందించాలని కోరారు. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించాలని, పంట దిగుబడులు పెంచే విధంగా కృషిచేయాలని, పంటలలో సాంకేతిక యాజమాన్యంతో పాటు, పలు సూచనలు, మెలకువలు, సాంకేతిక యాజమాన్య పద్దతు లు, నూతన వంగడాలు, నూతన-పరిజ్ఞానం పై అవగా హన తరగతులు, శిక్షణ తరగతులు నిర్వహించి, పరిక్ష నిర్వహించడం జరిగిందిని దీన్ని రైతుల ముంగిట్లోకి తీసుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో 40 మంది డీలర్లు, ఏడిఏ లాల్ చంద్, దేవి బ్యాచ్ పెసిలిటేటర్ కె.దా మోదర్ రెడ్డి, వ్యవసాయ అధికారి టెన్నెకల్ జి.దీపక్ ఆనంద్, జిల్లా ఉద్యానశాఖాధికారి ురియన్న, పాల్గొన్నారు.