Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్టు కార్మి కార్మికుల వేతన ఒప్పందం తదితర డిమాండ్లపై హైదరాబాదులోని డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీస్ ఏసిఎల్ చాంబర్లో గురువారం జరిగాయి. అసిస్టెంట్ కమిషనర్ లేబర్ ఏసిఎల్ పి.లక్ష్మణ్, యాజమాన్య ప్రతినిధి డివైజియం సిహెచ్ అశోక్ జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, బి.మధు, ఏ.వెంకన్న, షేక్ యాకుబ్ షావలి, నాగేశ్వరరావు, నాగభూషణం, డి బ్రహ్మానందం పాల్గొని కాంట్రాక్ట్ కార్మికుల 18 డిమాండ్లపై యాజమాన్యం పరిపాలన అనుమతికి సంబం ధించి రెండువారాల గడువుకోరారు. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ససేమీరా ఎన్ని వాయిదాలు కొరతారు, సాధ్యం కాదని మొండికేశారు. దీనిమీద ఏసిఎల్ కార్పొరేట్ జిఎం అయ్యార్తో మాట్లాడి తీసుకునే గడువులో జూలై 5న ఒప్పందం చేయాలని ఇదే ఆఖరు వాయిదా అని, యాజమాన్యంకు తెగేసి చెప్పారు. జూలై 5వ తారీఖు నాడు పాలనాపరమైన అంశాలన్నింటినీ పూర్తిచేసుకుని రావాలన్నారు. ఎట్టి పరిస్థితిలో ఒప్పందం ఫైనల్ చేసుకోవాలని జిఎంకి ఫోన్లో తెలియజేశారు. తిరిగి జెఎసి నాయకులను కూడా ఒప్పించారు. జరిగిన చర్చలలో సంతకాలు పెట్టుకుని చర్చలు వాయిదా వేసుకోవడం జరిగిందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు పాల్గొన్నారు.