Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం ద్వారా ఖమ్మం నగరం మరింత సుందరంగా తయారుకావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలో కొనసాగుతున్న పలు పనులను గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మోటార్ సైకిల్ పై ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. చెరువు బజార్ లోని పాత కబెలా వద్ద చేపట్టనున్న ప్రధాన కాల్వ మురుగు తొలగింపు పనులను ప్రారంభించారు. ఆనంతరం మయూరి సెంటర్, ముస్తఫా నగర్, స్టేషన్ రోడ్, కస్బా బజార్, కమాన్ బజార్, రావి చెట్టు బజార్, చర్చ్ కంపౌండ్, దంసలాపురం ప్రాంతాల్లో పర్యటించి ఆయా పనులను పరిశీలించి వైరా రోడ్డులోని బాబురావు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మురికి కాలువలో ఉ్న చెత్తాచెదారాన్ని పరిశీలించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ స్వయంగా పార పట్టి చెత్తను తొలగించారు. పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన ప్రతి పనిని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి డివిజన్ లో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లను అధికారులను కోరారు. ఖమ్మం నగర పరిధిలోని బోనకల్ రోడ్ లక్ష్మీ గార్డెన్స్ వద్ద 2022 - 23 గ్రీన్ బడ్జెట్ తో ఏర్పాటు చేసిన నర్సరీ ని పరిశీలించారు. అనంతరం 16వ డివిజన్ లో రూ. 15లక్షలతో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వరి,సూడా చైర్మన్ బచ్చు విజరు కుమార్,వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ డౌలే లక్ష్మీ ప్రసన్న, టి.ఆర్.ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు,కమర్తపు మురళి, మంత్రి వ్యక్తిగత చిరుమామిళ్ల రవి కిరణ్, కార్పొరేటర్లు, డిఈలు ధరణి, స్వరూపరాణి, నవ్య జ్యోతి, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ రంజిత్, అధికారులు,ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.