Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రోడ్డు ప్రమాదాల కట్టడికి పోలీసుల కొత్త వ్యూహాలు
- స్టేషన్కు రెండు చొప్పున తనిఖీ బృందాలు
-పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్
నవతెలంగాణ- ఖమ్మం
ప్రతిరోజు జరిగే రోడ్డు ప్రమాదాల సంఘటనల్లో డ్రంకన్ డ్రైవ్ విషాదానికి అద్దం పడుతోందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఈ క్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఘటనలకు చెక్ పెట్టేందుకు లాఅండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశామని ఇకనుంచి ప్రతి రోజూ రాత్రి వేళ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలో ప్రతి ఏటా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్న వారిలో బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) లెవల్స్ 150 నుంచి అత్యధికంగా 200 వరకు ఉంటోందని పెర్కొన్నారు. ఈ ఏడాది మే నెల వరకు డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ ఖమ్మం జిల్లా పరిధిలో మొత్తం 3669 మంది వాహనదారులు పోలీసులకు చిక్కారని తెలిపారు. ఇందులో ఖమ్మం నగరంలో పరిధిలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకొ వాల్సిన చర్యలపై ఇటీవల విస్తత స్థాయి సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు మెయిన్ రోడ్లతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారని, ట్రాఫిక్ రద్దీగా ఉండే రూట్లలో కనీసం 3 స్పెషల్ టీమ్స్పెడుతున్నారని తెలిపారు. రాత్రి 7 నుంచి 11 గంటల వరకు డ్రంకన్ డ్రైవ్ చెకింగ్ నిర్వ హిస్తున్నారని పెర్కొన్నారు. ప్రతి పోలీసు స్టేషన్లోనూ కనీసం రెండు బృందాల చొప్పున ఉండాలని, నిత్యం ఒకే స్పాట్లో కాకుండా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో, కనీసం మూడు గంటల చొప్పున డ్రైవ్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. రానున్న రోజులతో ప్రత్యేక సందర్భాల్లో ఈ తనిఖీల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.