Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ఈ నెల 21వ తేదీన జరుగు సీపీఐ పట్టణ, మండల మహాసభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు ఆయోధ్యచారి అన్నారు. శుక్రవారం కిన్నెర కళ్యాణ మండపంలో ఏదారి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. గిరిజనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోడు సాగుదారులకు పట్టాలు పంచుతానన్న మాట ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో మహిళా సమైఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్లక్ష్మీనారాయణ, మండల, పట్టణ కార్యదర్శిలు సర్వర్, సుధాకర్, ఎంపీటీసీ లక్ష్మయ్య, నాయకులు తదితరులు పాల్గ్గొన్నారు.