Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కులు సమర్పించుకున్న గ్రామస్తులు
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల పరిధిలోని సాయిరాం తండాలో గురువారం మహిళలు బోనం ఎత్తారు. ఈ నెల మొదటి తేదీన గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం, గ్రామ దేవత, నాభిశిల ప్రతిష్ఠా మహౌత్సవ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకున్నారు. 16 రోజులు పూర్తి అయిన సందర్భంగా గ్రామస్తులంతా 16 రోజుల పండుగను జరుపుకున్నారు. బోనాలు నెత్తిన పెట్టుకొని ఆలయానికి చేరుకున్నారు. ధ్వజస్తంభం వద్ద, బోనాలు పెట్టి నైవేద్యం సమర్పించారు. గ్రామ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ ధరావత్ రోజా బాలాజీ, హలావత్ రఘు, రాంజీ, నరసింహారావు, బాలాజీ, హలావత్ నరసింహారావు, వీరన్న పాల్గొన్నారు.