Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఆదర్శ నగర్ కాలనీలో మహాజన సోషలిస్టు పార్టీ భద్రాచలం పట్టణ కన్వీనర్ బొడ్డు సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహాజన సోషలిస్టు పార్టీ భద్రాచలం నియోజకవర్గ కోఆర్డినేటర్ అలవాల రాజా పెరియార్, నియోజకవర్గ కన్వీనర్ సోమక నరేష్ కుమార్లు పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మహాజన సోషలిస్టు పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల పార్టీ అని అన్నారు. మహాజన సోషలిస్టు పార్టీ నిర్మాణం కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని అన్నారు. రాష్ట్రంలో దొరల పాలన పోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అంతా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ్డు సత్యనారాయణ, ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఇల్లందుల హేమలత, మహిళ సమైక్య నాయకురాలు తరణి కళ్యాణి, చీరాల పార్వతి, ఆలేటి కుమారి, ఈశ్వరమ్మ, హనుమంతు, దుర్గ, వెంకటేశ్వర్లు, సత్యవతి, రవణమ్మ, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.