Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని పీకే ఓసి ప్రాజెక్టు అధికారి తాళ్లపల్లి లక్ష్మిపతి గౌడ్ అన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం ఓసీ 2 విశ్రాంతి భవనం ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొన్ని అంటు రోగాలను వైద్యులు కూడా నయం చేయలేరని, కరోనా అందుకు ఉదాహరణ అని సూక్ష్మక్రిమి ప్రపంచాన్ని ఎంతగా గడగడలాడించిందో, ఎంత మంది ప్రాణాల్ని బలిగొందో ప్రత్యక్షంగా చూశామని ఆయన ఉదహరించారు. పలువురు అధికారులు కార్మిక సంఘాల నాయకులు కార్మికులు ఎంతో ఉత్సాహంగా స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పికెఓసి పర్యావరణ అధికారి వరుణ్ అందరితో సామూహిక పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పీకేఓసి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు, ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరభద్రుడు, గని మేనేజర్ రాంబాబు, గుర్తింపు సంఘం నాయకులు, సామ శ్రీనివాస్ రెడ్డి, కోటా శ్రీనివాస్, రక్షణాధికారి లింగబాబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.