Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీవో
నవతెలంగాణ-భద్రాచలం
ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేటు బిల్డింగ్లలో నడపబడుతున్న డిగ్రీ కాలేజీల సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించడానికి కృషి చేస్తామని, అలాగే ప్రైవేటు బిల్డింగ్లలో నడుస్తున్న కాలేజీలకు త్వరలో ప్రభుత్వ బిల్డింగులలో తరలించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత ప్రిన్సిపాల్లకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం సూచించారు. శుక్రవారం తన ఛాంబర్లో మైనార్టీ గురుకులం, బీసీ గురుకులం, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల ప్రిన్సిపాల్, ప్రవేట్ బిల్డింగ్ల యజమానులతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల బూర్గంపాడు నందు నడుపుటకు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో నడుస్తున్నందున దానికి సంబంధించిన బిల్డింగ్ వివరాలు తనకు సమర్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఏపీఓ(జనరల్) ఇంచార్జి ఆర్సీవో(గురుకులం) డేవిడ్ రాజ్, ఖమ్మం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మానస, మైనార్టీ గురుకులం ఆర్సీఓ అనిత, బీసీ గురుకులం ప్రిన్సిపాల్ సులోచన పాల్గొన్నారు.