Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో 304 మంది ఉపాధ్యాయులు
- మొబైల్లో ఫోన్లో సమావేశానికి హాజరు అయినందుకు నోటీసులు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 15వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ హాజరు కావాలని ఉపాధ్యాయులకు కలెక్టరేట్ నుండి మొబైల్ లింక్ పంపించారు. ఈ నేపథ్యంలో 15వ తేదీన అనుకున్న సమయానికి ఉపాధ్యాయులు వారి వారి పరిధిలో ఉన్న జిల్లా, మండల కేంద్ర కార్యాలయాలలో వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కొంతమంది మొబైల్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మొబైల్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో ఎందుకు పాల్గొన్నారని షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగిందని ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని సుమారు 304 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అందిన సమాచారం. నోటీసులు అందుకున్న ఉపాధ్యాయులు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. గత రెండు రోజులుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టూ ఉపాధ్యాయులు చక్కర్లు కొడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశానికి హాజరయ్యామని , తమ తప్పేమీ లేదని , అయినప్పటికీ షోకాజ్ నోటీసులు అందుకోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. బడిబాట, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది ఫీల్డ్‌లో ఉన్న టీచర్లు కొంతమంది మొబైల్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ హాజరయ్యారని, కొంత మంది మండల, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి కొంత మంది హాజరయ్యారని వాపోతున్నారు. ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్‌కి జూమ్ లింక్ రావడంతోనే మొబైల్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మని అంటున్నారు. లింకు రానిపక్షంలో కచ్చితంగా మండల కేంద్రం, కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఉండేవారమని తెలుపుతున్నారు. జిల్లా అధికారుల నుండి మొబైల్ సందేశం ప్రకారం ఉపాధ్యాయులు హాజరయ్యారని, దీన్ని తప్పు భావించడం సరికాదని, ఈ విషయంలో కలెక్టర్ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.