Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పవిత్ర స్వాతంత్ర ఉద్యమాన్ని వక్రీకరించిన అంబేద్కర్ విశ్వవిద్యాలయం
- ఖత్మే నబువాత్ జిల్లా అధ్యక్షులు మౌలానా మహ్మద్ అబ్దుల్ కరీం రషాది
నవతెలంగాణ-కొత్తగూడెం
ఒక దేశ ద్రోహిని స్వాతంత్ర సమరయోధుడిగా పేర్కొంటూ పాఠ్యాంశాల్లో చేర్చడం విద్యార్ధులను తప్పుదోవపట్టించడమేనని, ఇది క్షమించరాని నేరమని ఖత్మే నబువాత్ భద్రాది జిల్లా అధ్యక్షులు మౌలానా మహ్మద్ అబ్దుల్ కరీం రషాది అన్నారు. పట్టణంలోని బూడిదగడ్డ ఏరియా మదర్సాలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అహ్మదీయ జవాత్ వ్యవస్థాపకులు గులాం అహ్మద్ ఖాదియాని స్వాతంత్రోద్యమంలో అంగ్లేయులకు ఏజెంటుగా, విధేయుడిగా వ్యవహరించాడని, భారతదేశ పౌరులకు, స్వాతంత్రోద్యమానికి నష్టం చేసే విధంగా, దేశాన్ని ముక్కులు చేసే విధంగా కుట్రలు చేశాడని, ఇలాంటి వ్యక్తిని అంబేద్కర్ విశ్వవిద్యాలయం వారు బీఏ ద్వితీయ సంవత్సరం ఉర్దూ మాద్యమ పాఠ్యాశంలో దేశ స్వాతంత్ర సమరయోధుడిగా, సామాజిక, సాంఘిక పరివర్తన చేసిన వ్యక్తిగా అభివర్ణిస్తూ ముద్రించడం ఘోరమైన తప్పిదమన్నారు. తననుతాను కృష్ణుడి అవతారంగా, క్రైస్తవ ప్రవకర్తగా ప్రకటించుకొని సర్వమతాలను కించపరిచిన గులాం అహ్మద్ ఖాదియానిని దేశభక్తుడుగా, గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడిగా అభివర్ణస్తూ పుస్తకంలో సిలబస్‌గా చేర్చడం ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ బి.ఆర్.విశ్వవిద్యాలయానికి తగదన్నారు. ముద్రించిన సిలబస్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఖత్మే నబువాత్ జిల్లా నాయకులు ముక్తీ యాకూబ్, ముత్తీ నదీమ్, ముఖీ ఒటెదుల్లా, ముత్తీ రఫీక్, హజీప్ అబ్దుల్ రషీద్ ఖాన్, ముత్తీ అబ్దుర్ రహమాన్, హఫీజ్ అన్వర్, మమ్మద్ అయూబ్, అస్మత్ పాల్గొన్నారు.