Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు
- విద్యానగర్ కాలనీ బాధిత ప్రజల నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-కొత్తగూడెం
చుంచుపల్లి మండలంలోని విద్యానగర్లో మేము గత 30 ఏండ్లు క్రితం గల 137/1 నుండి 139/9లో గల 1/70 కంటే ముందు రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి పాలడుగు లక్ష్మణ రావు, గొలుసుల మల్లయ్య పట్టాదారు నుండి క్రయం పొంది ఉండి చాలా వరకు నివాస గృహములు నిర్మించు కొన్నాము. ఇట్టి స్థలములో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్నీ వర్గాల ప్రజలు నివసిస్తున్నామని, అట్టి భూమిపై ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ తండ్రి బాదావత్ సీతారాములు, ఎమ్మెల్యే భర్త హరిసింగ్ గత 12 సంవత్సరముల నుండి అతనిది కాని భూమిపై తన పేరు మీద ఎటువంటి రికార్డులలో లేని భూమిపై వివిధ కోర్టులలో కేసులు పెట్టి, అక్కడ నివశిస్తున్న ప్రజలను మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. కావున, దయచేసి ఇతని నుండి కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, విద్యానగర్ పంచాయతీ సర్పంచ్ గోవింద్, మధు, కోనేరు నాగేశ్వరరావు, కాలనీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.