Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్‌లోని కోడిపుంజుల వాగుపై నాల్గవ పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న డిషిల్టేషన్ (పూడికతీత) పనుల్లో తీసిన బురదను మున్సిపాలిటీ వారు మరిచారు. గత వారం రోజుల క్రితం తీసిన పూడిక బురద నడిరోడ్డుపైనే వదిలేసి, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మున్సిపాలిటీ వారు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు బురదమయంగా మారి, దుర్వాసన వెదజల్లుతూ, దోమలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపాలీటీ వారు స్పందించి రోడ్డుపై ఉన్న బురదను, చెత్తను తొలగించాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.