Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు డైట్ విషయంలో మెనూ ప్రకారం తప్పనిసరిగా పౌష్టిక రమైన ఆహారం అందించాలని ఈ విషయంలో అలసత్వం వహిస్తే సంబంధిత వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పొట్రు అన్నారు. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ, వసతి గృహాలలో పనిచేయుచున్న హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి పరిధిలో ఉన్న ప్రైవేటు కాలేజీలో చదివే గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు సంబంధిత ఆశ్రమ, వసతి గృహాలలో చేర్పించే బాధ్యత వార్డెన్లపై ఉందని ఆయన అన్నారు. ఇకముందు ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులకు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని తప్పకుండా అందరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రమాదేవి, ఖమ్మం డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి, కృష్ణా నాయక్, భద్రాచలం ఏటీడీఓ నరసింహారావు, ఖమ్మం ఏటీడీఓ తిరుమల రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా హాస్టల్ వెల్ఫేర్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.