Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాళం వేసిన గ్రామస్తులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఊరు పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చేరమని ఓ వైపు బడి బాటలు నిర్వహిస్తున్న సర్కార్ సరైన వసతులు కల్పించక పోవడం లక్ష్యం నీరు గారుతుంది. సమస్యలన్నీ ముందే తెలిసినా పట్టించుకోక పోవటం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం అడుగడుగున కనపడుతుంది. ఎన్నో పాఠశాలలు సౌకర్యాలు లేమి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన బోధన అందించడానికి సరిపడ ఉపాధ్యాయులు లేక పోవడం విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాలకు తాళాలు వేస్తున్నారు.
తాజాగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు మొత్తం 118 మంది విద్యార్థులు ఉన్నారని కాని వారికి ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారని ఇద్దరు టీచర్లు అంత మంది విద్యార్థులకు ఎలా బోధిస్తారని నిలదీశారు. ఉపాధ్యాయులు లేకపో వడంతో పిల్లలకు సరైన విద్య అందడం లేదని తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. కొన్ని గ్రామాల్లో విద్యార్థులు లేక పాఠశాలలు మూత పడుతుండగా, తమ గ్రామంలో విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడే దుస్థితి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపొతున్నారు. ప్రధానో పాధ్యాయుడు కూడా లేకపోవడంతో విద్యార్థులకు టీసీలు, నూతన విద్యారు ్థలను చేర్చుకోవడం తదితర వాటితో విద్యార్థులకు బోధన దూరం అవుతోంద న్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు అనే సంగతి ఇంతకుముందు రెండు మూడు సార్లు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లగా ఎలాంటి లాభం లేకపో యింది అని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లనున్నామని తల్లిదండ్రులు తెలిపారు. ఉపాధ్యాయులు వచ్చేవరకు పాఠశాల గేట్లు తాళాలు తియ్యమని విద్యార్థుల తల్లితండ్రులు తెలిపారు.
సర్కార్ మాటలు డోళ్లతనం కనబడుతుంది : జుజ్జూరి దుర్గారావు గ్రామ పెద్ద
తిరుమలకుంట పాఠశాలలో 118 మంది విద్యార్థులు ఉన్న బడిలో ఉపా ధ్యాయులు ఇద్దరే ఉండడం, ఈ విషియం పైనా అధికారుల దృష్టికి తిసుకు పోయినా ప్రభుత్వం నిమ్మకు నిరుత్తెనట్టు ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఏమి చెయ్యలేకపోతున్నారు. కనీసం విద్య వాలంటీర్ లయినా తీసుకోవాలి. పాఠశాలను నడిపించి విద్యార్థులకు చక్కని భవిష్యత్తు కల్పించాలి.