Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
గిరి వికాస బోర్లు వేసేందుకు కమిటీ ఆమోదంతో సమగ్ర నివేదికలు అందచేయాలని కలెక్టర్ అనుదీప్ ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం గిరి వికాసం కింద బోర్లు వేయు ప్రక్రియపై పంచాయతీ రాజ్, విద్యుత్, ఐటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు రెండు పంటలు సాగు చేయడానికి బోర్లు వేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పారు. బోర్లు వేసి నీటి సౌకర్యం కల్పించడం వల్ల సమృద్ధిగా రెండు పంటలు సాగవుతాయని, తద్వారా రైతులు ఆర్థికంగా బల పడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. వచ్చే సోమవారం వరకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులు వ్యవసాయం చేసేందుకు నీటి సౌకర్యం కల్పనకు బోర్లు వేయాల్సిన అవసరం ఉందని వచ్చే సోమవారం వరకు సక్రమంగా ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. మంజూరు చేసిన బోర్లకు విద్యుత్ సౌకర్యం కల్పనకు డిమాండ్ నోటీస్లు జారీ చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. బడ్జెట్ అందుబాటులో ఉందని వినియోగించుకుందా మని చెప్పారు. బోర్లు వేయాల్సిన అవసరం చాలా ఉందని ప్రాధాన్యతను గమనంలోకి తీసుకోవాలని చెప్పారు. ప్రతిపాదనలు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, జడ్పి సీఈఓ విద్యాలత, డీపీఓ రమాకాంత్, విద్యుత్ డీఈ విజయ్ కుమార్, అన్ని మండలాల ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.