Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ప్రతిఘటన తప్పదు
- ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ప్రజా ప్రతినిధులు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య, రాష్ట్ర నాయకులు మచ్చా, యలమంచి
నవతెలంగాణ- దుమ్ముగూడెం
ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఎర్ర జెండాలు చేత పూని మండల కేంద్రానికి వేలాదిగా తరలి వచ్చి కదం తొక్కారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం చేపట్టిన ప్రజా ప్రదర్శన, ధర్నా కార్యక్రమానికి ప్రజలు వేలాది తరలి వచ్చారు. ములకపాడు సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన, ధర్నా నిర్వహించి 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన ప్రదర్శన, ధర్నా కార్యక్రమాని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచి రవి కుమార్ మాట్లాడుతూ పోడు భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని, అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, ఆదివాసుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. మండలంలో అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటి స్థలాలు ఉన్నవారికి సొంత స్థలంలో ఇల్లు కట్టి ఇవ్వాలని గత మూడేండ్ల నుండి పెన్షన్లు కోసం దరఖాస్తు పెట్టిన ప్రతి పెన్షన్ దారుడుకి వెంటనే పెన్షన్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని అన్నారు. దుమ్ముగూడెం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి పైపులైన్లు వేయాలని, రైతులందరికీ కొత్తగా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని రైతులందరికీ సబ్సిడీ ద్వారా ఎరువులు, పురుగు మందులు విత్తనాలు అందించాలని, కల్తీ విత్తనాలు, పురుగు మందులు అమ్మే వ్యాపారస్తులు పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పోడు రైతులందరికీ రైతు బంధు వర్తింపు చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సరియం కోటేశ్వరావు, యలమంచి వంశీకృష్ణ, కె.చిలకమ్మ, మర్మం చంద్రయ్య, సరియం రాజమ్మ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, బొల్లి సూర్యచంద్రరావు, కొడాలి లోకేష్ బాబు, మర్మం సమ్మక్క, సోయం నాగమణి, సోయం వీర్రాజు, వీరభద్రం, ఖాదర్ బాబు, సరియం ప్రసాద్, సర్పంచులు మీడియం జయ, తోడం తిరుపతి రావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.