Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామక్రిష్ణారెడ్డి
నవతెలంగాణ-అశ్వారావుపేట
వంట నూనెల సంవృద్ధికి దోహదపడే ఆయిల్‌పాం సాగు విస్తరణను ఉద్యోగులు సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ఫెడ్‌కు నిర్దేశించిన సాగు విస్తరణ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. టీఎస్ ఆయిల్‌ఫెడ్ పరిధిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, నర్సరీ ఇన్ చార్జిలు సోమవారం ఆశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హజరై ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సర్కార్ తోడ్పాటుతో టీఎస్ ఆయిల్‌ఫెడ్ బలోపేతం కావటమే కాకుండా అయిల్ రికవరీ, గెలల గిట్టుబాటు ధర కల్పించటంలో ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచిందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు సమయానికి తెలంగాణలో కేవలం 25 వేల ఎకరాల్లోనే అయిరాం సాగు అయ్యేదని, పామాయిల్ సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. రాబోవు నాలుగేళ్ళలో ప్రయివేట్ కంపెనీల భాగస్వా మ్యంతో 20 లక్షల ఎకరాల్లో అయిలాం సాగును విస్తరణకు లక్ష్యాన్ని నిర్దేశిం చిందని, ఒక్క టీఎస్ ఆయిల్ఫైడ్ సంస్థకే 8 జిల్లాల్లో 2 లక్షల ఎరరాల సాగు విస్తరణ బాధ్యతను అప్పగించిందని, ఇందులో ఈ ఏడాది 80 వేల ఎకరాల సాగు విస్తరణ పూర్తి చేయాలని కార్యచరణతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. భవిష్యత్ అయిల్‌ఫాం సాగుదేనని తెలిపారు. గతంలో టన్ను ధర రూ.10 వేలు కోసం రైతులు అనేక పోరాటాలు చేశారని, ఇప్పుడు రూ.23 వేలు వేలకు పైగా అందిస్తున్న ఘనత టీఎస్ ఆయిల్ ఫెడ్ దక్కుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, చెన్నై రాష్ట్రాల రైతుల కంటే తెలం గాణ రైతులకు ఒక్కొక్క టన్నుకు రూ.1,500పైగా టీఎస్ ఆయిల్ఫైడ్ అంది స్తుందని చెప్పారు. ఉద్యోగులు బాద్యతగా పని చేసినప్పుడే ప్రభుత్వ రంగ సంస్థలు పటిష్టమవుతాయని, నిర్లక్ష్యం చేస్తే నిర్వీర్యం అవుతాయని హెచ్చరించారు.
సాగుపై అవగాహన కోసం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో క్షేత్ర సందర్శన చేశారు. ముందుగా దమ్మపేట మండలంలో పామ్ ఆయిల్ తోటలను పరిశీలించి యాజమాన్య పద్ధతులను రైతుల నుండి ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం నారంవారిగూడెం ఆయిల్‌ఫాం నర్సరీని సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకం, ప్రభుత్వ రాయితీలు, రైతులకు పంపిణీ వంటి అంశాలను చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి వివరించారు. ఆయన వెంట అయిల్ఫైడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదరు కుమార్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల బాలకృష్ణ, కళ్యాణ్, టెక్నికల్ కన్సెల్టెంట్ రాజశేఖర్‌రెడ్డి, టీఎస్ ఆయిల్ ఫెడ్ పరిధిలోని ఫీల్డ్ ఆఫీసర్లు, పీల్డ్ అసిస్టెంట్లు, నర్నర్ ఇన్చార్జిలు ఉన్నారు.