Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
ఈ దేశానికి కమ్యూనిస్టులు ఎంతో అవసరమని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బండారు రమేష్ అన్నారు.మండల కేంద్రంలో సిపిఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం నిర్వహించారు. ఈక్లాసులకు ప్రిన్సిపాల్‌గా బింగి రమేష్ వ్యవహరించారు. ఈ సమావేశంలో బండారు రమేష్ మాట్లాడుతూ దేశంలో అవినీతి పెరిగిపోతోందని, ధనవంతులు ధనవంతులు లాగే పేదలు పేద లాగే మిగిలిపోతున్నారన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుబేరులకు కొమ్ము కాస్తుందని పేద ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం వీరోచిత పోరాటాలు చేసిన పార్టీ సిపిఎం అని, ఆ పార్టీ ముందుకు నడవడం కోసం కార్యకర్తలు సైద్ధాంతిక అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. ప్రజా సంఘాలు పార్టీ నిర్మాణం అనే అంశంపై డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోధించారు.
కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్, సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, అంగిరేకుల నరసయ్య, కొల్లి చలం స్వామి, బి.పద్మనాభం, సుధాకర్, వెంకట్రావు, వీరన్న, కొత్తపల్లి వెంకన్న, గుండమాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.