Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైరా ఎస్ఐ శాఖమూరి వీరప్రసాద్ హెచ్చరించారు. వైరా పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని సూచించారు. రైతులు తాము కొనుగోలు చేసిన విత్తనాలకు విధిగా బిల్లు తీసుకోవాలని కోరారు. విత్తన దుకాణాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా తమ వద్ద ఉన్న విత్తనాల నిల్వల వివరాలను బోర్డులపై పొందుపర్చాలన్నారు. గ్రామాల్లో సంచరించి విత్తనాలు విక్రయించే వారి వద్ద రైతులు విత్తనాలను కొనుగోలు చేయవద్దని స్పష్టం చేశారు. గ్రామాల్లో సంచరించి విత్తనాలు విక్రయించటానికి వచ్చే వారి వివరాలను పోలీసులకు, వ్యవసాయ అధికారులకు, వెంటనే తెలియజేయాలని తెలిపారు.