Authorization
Wed April 16, 2025 08:11:14 pm
నవతెలంగాణ-కారేపల్లి
సింగరేణి గ్రామ పంచాయతీలో నిధుల దుర్వి నియోగ ఆరోపణలపై ఆదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి సోమవారం విచారణ చేశారు. పంచాయతీ నిధులు దుర్వి నియోగం అయ్యాయని గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఉన్నతాధికారులు, లోకాయుక్తా, హెచ్ఆర్సీలను ఆశ్రయిం చటంతో నిధులు విషయమై సమగ్ర విచారణకు ఆదనపు కలెక్టర్ స్నేహలత, డీఎల్పీవో ప్రభాకర్లు వచ్చారు. పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. రికార్డులలో తెల్పిన పనులను వారు తనిఖీ చేశారు. ఆన్లైన్లో చేసిన పనులు, నిధుల ఖర్చుపై ఆరాతీశారు. ఈసందర్భంగా కొందరు వార్డు సభ్యులు పలు సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. వీరి వెంట ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో రాజారావు లు ఉన్నారు.