Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐ.టి.విద్యార్ధులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని గత ఆరు రోజులు నుండి తరగతులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారని, విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మంగళవారం ఛలో బాసర ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రాణపు మధు పిలుపు ఇచ్చారు. సోమవారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి విద్యార్ధుల ఆందోళన పట్ల అసమ్మతి కామెంట్స్ చేస్తున్నారని, కెటిఆర్ ట్విట్టర్లో స్పందించడం తప్ప విద్యార్దులను మాత్రం కలసి వారి పరిష్కారానికి ఎలాంటి హామీ ఇవ్వడం లేదని, ఆందోళన చేస్తున్న విద్యార్ధుల పట్ల బాధ్యతగా వ్యవరించడం లేదని, తక్షణమే వారి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఛలో బాసర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తుడం ప్రవీణ్, ఖమ్మం టౌన్ కన్వీనర్ తరుణ్, ఎస్.ఎఫ్.ఐ నాయకులు రామకృష్ణ, యశ్వంత్, దినేష్, రాజు, రవి, గణేష్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.