Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
ఖమ్మంలోని మహేంద్ర షో రూమ్ లో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ఇంజన్ కాలిపోయిన బాధిత రైతును షోరూం యాజమాన్యం తక్షణమే ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని బోదులబండ గ్రామానికి చెందిన రైతు మీసా రంగారావు ఖమ్మంలోని మహేంద్ర షో రూమ్లో కొనుగోలు చేసిన ట్రాక్టర్ సెల్ఫ్ మోటర్ సమస్యతో గత రెండు రోజుల క్రితం కాలిపోవడంతో రైతు ధర్నాకు దిగిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనపై మండల కార్యదర్శి కె.వి రామిరెడ్డి ధర్నా చేస్తున్న రైతును పరామర్శించి తమ సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేంద్ర షోరూం యజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ట్రాక్టర్ ఇంజన్ కాలిపోయిందని ఆయన అన్నారు. ట్రాక్టర్ సెల్ఫ్ మోటర్ సమస్య ఉందని ట్రాక్టర్ కొనుగోలు చేసిన నాటినుండి అనేకసార్లు షో రూమ్ వారి దృష్టికి రైతు తీసుకెళ్లినా ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గొడవర్తి నాగేశ్వరరావు, దుగ్గి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.